తెలుగు అనువాదంతో సూరహ్ ముల్క్
సూరహ్ అల్-మुल्क్ (కురాన్ 67వ అధ్యాయం), సాధారణంగా “సార్వభౌమత్వం” (The Sovereignty) అని పిలవబడేది, ఇది దైవిక రక్షణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి గౌరవంగా భావించే ఒక గంభీర్ అధ్యాయం. ఇది పఠించే వ్యక్తి కోసం కియామతు రోజున విన్నపం చేయడం మరియు విశ్వాసులను సమాధి బాధల నుంచి రక్షించడం ద్వారా ప్రసిద్ధి చెందింది. ఈ సూరహ్ మిలియన్లకొత్త రాత్రి జీవనాధారం.
కానీ దాని సందేశాన్ని అర్థం చేసుకోవడం, దాని ఆशीర్వాదాలను తెరవడానికి కీలకమైనది. అరబీ మాట్లాడని వారికీ, దాని అర్థం పొందడం పఠనాన్ని కేవలం ఆచారంగా కాకుండా గుండెతో కూడిన ఆలోచనగా మార్చవచ్చు.
| వివరాలు | సమాచారం |
|---|---|
సూరా పేరు | ముల్క్ |
అధ్యాయం సంఖ్య | 67 |
శ్లోకాల సంఖ్య | 30 |
ప్రకటన స్థలం | మక్కా |
జుజ్ (పారా) సంఖ్య | 29 |
కీ థీమ్స్ | సార్వభౌమాధికారం, జవాబుదారీతనం, సృష్టిపై ప్రతిబింబం |
పదాలు | 337 |
ఉత్తరాలు | 1332 |
| రుకుస్ | 2 |
సూరా ముల్క్ యొక్క తెలుగు అనువాదం
[su_box title=”بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]అనంత కరుణామయుడు, అపార కరుణామయుడు అయిన అల్లాహ్ పేరుతో.[/su_box]
[su_box title=”تَبَٰرَكَ ٱلَّذِي بِيَدِهِ ٱلۡمُلۡكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٌ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఎవరి చేతిలోనయితే విశ్వసామ్రాజ్యాధిపత్యం ఉందో! ఆయన సర్వశ్రేష్ఠుడు (శుభదాయకుడు) మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు –[/su_box]
[su_box title=”ٱلَّذِي خَلَقَ ٱلۡمَوۡتَ وَٱلۡحَيَوٰةَ لِيَبۡلُوَكُمۡ أَيُّكُمۡ أَحۡسَنُ عَمَلٗاۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు – [/su_box]
[su_box title=”ٱلَّذِي خَلَقَ سَبۡعَ سَمَٰوَٰتٖ طِبَاقٗاۖ مَّا تَرَىٰ فِي خَلۡقِ ٱلرَّحۡمَٰنِ مِن تَفَٰوُتٖۖ فَٱرۡجِعِ ٱلۡبَصَرَ هَلۡ تَرَىٰ مِن فُطُورٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణా మయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా [/su_box]
[su_box title=”ثُمَّ ٱرۡجِعِ ٱلۡبَصَرَ كَرَّتَيۡنِ يَنقَلِبۡ إِلَيۡكَ ٱلۡبَصَرُ خَاسِئٗا وَهُوَ حَسِيرٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఇంకా, మాటిమాటికీ నీ చూపులు త్రిప్పి చూడు. అది (నీ చూపు) విఫలమై అలిసి సొలిసి తిరిగి నీ వైపుకే వస్తుంది [/su_box]
[su_box title=”وَلَقَدۡ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنۡيَا بِمَصَٰبِيحَ وَجَعَلۡنَٰهَا رُجُومٗا لِّلشَّيَٰطِينِۖ وَأَعۡتَدۡنَا لَهُمۡ عَذَابَ ٱلسَّعِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము. మరియు వాటిని, షైతాన్ లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. మరియు వారి కొరకు (షైతానుల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము [/su_box]
[su_box title=”وَلِلَّذِينَ كَفَرُواْ بِرَبِّهِمۡ عَذَابُ جَهَنَّمَۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]మరియు తన ప్రభువును (అల్లాహ్ ను) తిరస్కరించే వారికి నరకశిక్ష ఉంది. అది ఎంత చెడ్డ గమ్యస్థానం [/su_box]
[su_box title=”إِذَآ أُلۡقُواْ فِيهَا سَمِعُواْ لَهَا شَهِيقٗا وَهِيَ تَفُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]వారు అందులోకి విసిరి వేయ బడినప్పుడు వారు దాని (భయంకరమైన) గర్జనను వింటారు. మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది [/su_box]
[su_box title=”تَكَادُ تَمَيَّزُ مِنَ ٱلۡغَيۡظِۖ كُلَّمَآ أُلۡقِيَ فِيهَا فَوۡجٞ سَأَلَهُمۡ خَزَنَتُهَآ أَلَمۡ يَأۡتِكُمۡ نَذِيرٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]అది దాదాపు ఉద్రేకంగా ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి (పాపుల) గుంపు పడవేయబడి నప్పుడు! దాని కాపలాదారులు వారితో: ఏమీ? మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదు?” అని ప్రశ్నిస్తారు [/su_box]
[su_box title=”قَالُواْ بَلَىٰ قَدۡ جَآءَنَا نَذِيرٞ فَكَذَّبۡنَا وَقُلۡنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَيۡءٍ إِنۡ أَنتُمۡ إِلَّا فِي ضَلَٰلٖ كَبِيرٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]వారంటారు: ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: `అల్లాహ్ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింప జేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు [/su_box]
[su_box title=”وَقَالُواْ لَوۡ كُنَّا نَسۡمَعُ أَوۡ نَعۡقِلُ مَا كُنَّا فِيٓ أَصۡحَٰبِ ٱلسَّعِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఇంకా వారు ఇలా అంటారు: ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే, మేము మండే అగ్నిజ్వాలలో పడి వుండే వారితో చేరే వారము కాము కదా [/su_box]
[su_box title=”فَٱعۡتَرَفُواْ بِذَنۢبِهِمۡ فَسُحۡقٗا لِّأَصۡحَٰبِ ٱلسَّعِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగభగమండే అగ్నిజ్వాలలు దూరమై పోవుగాక [/su_box]
[su_box title=”إِنَّ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُم بِٱلۡغَيۡبِ لَهُم مَّغۡفِرَةٞ وَأَجۡرٞ كَبِيرٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]నిశ్చయంగా, ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి [/su_box]
[su_box title=”وَأَسِرُّواْ قَوۡلَكُمۡ أَوِ ٱجۡهَرُواْ بِهِۦٓۖ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడి చేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు [/su_box]
[su_box title=”أَلَا يَعۡلَمُ مَنۡ خَلَقَ وَهُوَ ٱللَّطِيفُ ٱلۡخَبِيرُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు [/su_box]
[su_box title=”هُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ ذَلُولٗا فَٱمۡشُواْ فِي مَنَاكِبِهَا وَكُلُواْ مِن رِّزۡقِهِۦۖ وَإِلَيۡهِ ٱلنُّشُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]భూమిని మీ అధీనంలో ఉంచినవాడు ఆయనే! కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి, మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలి పోవలసి ఉంది [/su_box]
[su_box title=”ءَأَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يَخۡسِفَ بِكُمُ ٱلۡأَرۡضَ فَإِذَا هِيَ تَمُورُ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఏమీ? మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు, మిమ్మల్ని భూమిలోకి అణగద్రొక్కడని, ఎప్పుడైతే అది తీవ్రకంపనాలకు గురి అవుతుందో [/su_box]
[su_box title=”أَمۡ أَمِنتُم مَّن فِي ٱلسَّمَآءِ أَن يُرۡسِلَ عَلَيۡكُمۡ حَاصِبٗاۖ فَسَتَعۡلَمُونَ كَيۡفَ نَذِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]లేక ఆకాశాలలో ఉన్నవాడు, మీపైకి రాళ్ళు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు [/su_box]
[su_box title=”وَلَقَدۡ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَكَيۡفَ كَانَ نَكِيرِ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. నా పట్టు (శిక్ష) ఎంత తీవ్రంగా ఉండిందో (చూశారా) [/su_box]
[su_box title=”أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلطَّيۡرِ فَوۡقَهُمۡ صَـٰٓفَّـٰتٖ وَيَقۡبِضۡنَۚ مَا يُمۡسِكُهُنَّ إِلَّا ٱلرَّحۡمَٰنُۚ إِنَّهُۥ بِكُلِّ شَيۡءِۭ بَصِيرٌ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఏమీ? వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురుతున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు [/su_box]
[su_box title=”أَمَّنۡ هَٰذَا ٱلَّذِي هُوَ جُندٞ لَّكُمۡ يَنصُرُكُم مِّن دُونِ ٱلرَّحۡمَٰنِۚ إِنِ ٱلۡكَٰفِرُونَ إِلَّا فِي غُرُورٍ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఏమీ? అనంత కరుణామయుడు తప్ప మీకు సేన వలే అడ్డుగా నిలిచి, మీకు సహాయపడ గల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్యతిరస్కారులు కేవలం మోసంలో పడి వున్నారు [/su_box]
[su_box title=”أَمَّنۡ هَٰذَا ٱلَّذِي يَرۡزُقُكُمۡ إِنۡ أَمۡسَكَ رِزۡقَهُۥۚ بَل لَّجُّواْ فِي عُتُوّٖ وَنُفُورٍ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపి వేస్తే, మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబిరుసుతనంలో మునిగి (సత్యానికి) దూరమై పోతున్నారు [/su_box]
[su_box title=”أَفَمَن يَمۡشِي مُكِبًّا عَلَىٰ وَجۡهِهِۦٓ أَهۡدَىٰٓ أَمَّن يَمۡشِي سَوِيًّا عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా [/su_box]
[su_box title=”قُلۡ هُوَ ٱلَّذِيٓ أَنشَأَكُمۡ وَجَعَلَ لَكُمُ ٱلسَّمۡعَ وَٱلۡأَبۡصَٰرَ وَٱلۡأَفۡـِٔدَةَۚ قَلِيلٗا مَّا تَشۡكُرُونَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]వారితో ఇలా అను: ఆయనే మిమ్మల్ని సృజించాడు. మరియు ఆయనే మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలనూ ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ [/su_box]
[su_box title=”قُلۡ هُوَ ٱلَّذِي ذَرَأَكُمۡ فِي ٱلۡأَرۡضِ وَإِلَيۡهِ تُحۡشَرُونَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″](ఇంకా) ఇలా అను: ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు [/su_box]
[su_box title=”وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلۡوَعۡدُ إِن كُنتُمۡ صَٰدِقِينَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]మరియు వారు ఇలా అడుగుతున్నారు: మీరు సత్యవంతులే అయితే, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది [/su_box]
[su_box title=”قُلۡ إِنَّمَا ٱلۡعِلۡمُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٞ مُّبِينٞ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]వారితో ఇలా అను: నిశ్చయంగా, దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసే వాడిని మాత్రమే [/su_box]
[su_box title=”فَلَمَّا رَأَوۡهُ زُلۡفَةٗ سِيٓـَٔتۡ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُواْ وَقِيلَ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تَدَّعُونَ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. మరియు వారితో ఇలా అనబడుతుంది: మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే [/su_box]
[su_box title=”قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَهۡلَكَنِيَ ٱللَّهُ وَمَن مَّعِيَ أَوۡ رَحِمَنَا فَمَن يُجِيرُ ٱلۡكَٰفِرِينَ مِنۡ عَذَابٍ أَلِيمٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″](ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ అల్లాహ్ నన్ను మరియు నా తోటి వారిని నాశనం చేయనూ వచ్చు! లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు. కాని సత్యతిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించగలడు [/su_box]
[su_box title=”قُلۡ هُوَ ٱلرَّحۡمَٰنُ ءَامَنَّا بِهِۦ وَعَلَيۡهِ تَوَكَّلۡنَاۖ فَسَتَعۡلَمُونَ مَنۡ هُوَ فِي ضَلَٰلٖ مُّبِينٖ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]వారితో ఇంకా ఇలా అను: ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వసించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు [/su_box]
[su_box title=”قُلۡ أَرَءَيۡتُمۡ إِنۡ أَصۡبَحَ مَآؤُكُمۡ غَوۡرٗا فَمَن يَأۡتِيكُم بِمَآءٖ مَّعِينِۭ” box_color=”#E4E4E4″ title_color=”#000000″]వారితో ఇలా అను: ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ మీ బావులలోని నీరు, భూమిలోనికి ఇంకి పోతే, ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు [/su_box]
అరబిక్ + తెలుగు సూరహ్ ముల్క్ అనువాదం
తెలుగు ఆడియోలో సూరహ్ ముల్క్
తెలుగులో సూరా ముల్క్ + అరబిక్ ఆడియో
సూరా ముల్క్ తెలుగు అనువాద వీడియో
సూరా ముల్క్ అనువాదం యొక్క ప్రాముఖ్యత
అందుబాటులో ఉండడం: అరబీ మాట్లాడని వారికీ దాని లోతైన విషయాలను (అల్లాహ్ యొక్క సార్వభౌమత్వం, సమాధాన్యత, మరియు దయ) అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది.
ఆలోచన (తదబ్బుర్): కురాన్ యొక్క ఆదేశం “దాని ఆయతులపై ఆలోచించు” (కురాన్ 38:29) ను నెరవేర్చుతూ అర్థాన్ని స్పష్టంగా చేస్తుంది.
ఆధ్యాత్మిక సంబంధం: పఠనాన్ని కేవలం ఆచారంగా కాకుండా హృదయంతో కూడిన సాన్నిహిత్యంగా మార్చి భక్తిని లోతుగా పెంచుతుంది.
ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శనం: భాషా అడ్డంకులను అధిగమించి, దాని రక్షణ మరియు నైతిక పాఠాలను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేస్తుంది.
శిక్షణా సాధనం: ఉపాధ్యాయులు, విద్యార్థులు, మరియు కొత్త ముస్లింలకు వ్యక్తిగత అభివృద్ధి మరియు బోధన కోసం దాని సందేశాన్ని అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది.
తీర్మానం
సూరహ్ ముల్క్ ఒక దైవిక రక్షణ, విశ్వాసులను అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి, పరలోకానికి తయారయ్యేందుకు, మరియు న్యాయపూర్వకంగా జీవించడానికి ప్రేరేపిస్తుంది. దాని అనువాదం ఈ శాశ్వత సత్యాలకు ప్రవేశాన్ని తెరిచేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిములను దాని జీవితం మార్పు చేసే సందేశంతో దీపంగా కనెక్ట్ చేయడానికి శక్తినిస్తుంది. దాని ఆయతులను అర్థం చేసుకోవడం ద్వారా, మనం రాత్రి తిలావతిని మార్గదర్శనం, రక్షణ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి యొక్క మూలంగా మారుస్తాం.
“చెప్పు, ‘అతనే అత్యంత దయాళువు; మేము అతనిలో విశ్వసించాము, మరియు అతనిపై ఆధారపడినాము.’” (కురాన్ 67:29)
